లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ రాబోయే సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో ఈసినిమా వస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతుంది. తాజాగా చెర్రీని కలిసిన బుచ్చిబాబు తన ట్విట్టర్ ద్వారా చెర్రీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఎక్సైంటింగ్ మూమెంట్స్ మున్ముందు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతోో ఈఫొటో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Exciting times ahead!!!!
With our Global Star… @AlwaysRamCharan garu ❤️ pic.twitter.com/dC4HmDblSP
— BuchiBabuSana (@BuchiBabuSana) May 24, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: