యువసామ్రాట్ నాగ చైతన్య నటించిన కస్టడీ రేపు థియేటర్లలోకి రానుంది.గత కొద్దీ రోజుల నుండి అన్ని తానై సినిమాను ప్రమోట్ చేశాడు చైతన్య.ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాకు హైప్ వచ్చింది.దాంతో ఈసినిమా మంచి అంచనాలతో బాక్సాఫీస్ బరిలో దిగుతుంది.ఈసినిమా విజయం నాగ చైతన్య కెరీర్ కు కీలకం కానుంది. చైతన్య అయితే కస్టడీ విజయం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సెన్సార్ యూనిట్ నుండి కూడా పాజిటివ్ రివ్యూ వచ్చింది.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమా బాగుందని విలన్ ను హీరో కాపాడుకోవాలనే కాన్సెప్ట్ అందుకు గల కారణం అలాగే స్క్రీన్ ప్లే బాగుందని సెన్సార్ సభ్యులు అన్నారని సమాచారం అలాగే కస్టడీకి పెద్దగా కట్స్ ఏమి లేకుండా యు /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.2గంటల 27నిమిషాల రన్ టైంతో రానుంది ఈసినిమా.మరి ఈసినిమాను రేపు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అరవింద స్వామి విలన్ పాత్రలో కనిపించనున్నాడు.శరత్ కుమార్,సంపత్ రాజ్,ప్రియమణి కీలకపాత్రలు పోషించారు.ఇళయరాజా,యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈసినిమా తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























