ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఏడాది సంక్రాంతి కానుకగా..పలువురి స్టార్ హీరోల సినిమాలు రిలీజై ప్రేక్షకులకు అసలైన పండుకను తీసుకొచ్చిపెడుతుంటాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు ఇలా పలు సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఇప్పటినుండే పోటీ పెరిగిపోయింది. 2024 సంక్రాంతికి కూడా స్టార్ హీరోలు పోటీ పడనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మొదట 2024 సంక్రాంతికి ముందే రిజర్వేషన్ చేసుకున్న సినిమా ప్రాజెక్ట్ కే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 జనవరి 12న పాన్ వరల్డ్ మూవీ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఇన్ని రోజులు ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్రయూనిట్ తాజాగా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ లుక్ లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేస్తూ దానితో పాటు జనవరి 13, 2024 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరోతో శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఇన్ని రోజులు ఆర్సీ 15 అనే టైటిల్ తో షూటింగ్ ను జరుపుకుంటుండగా.. తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ను ఖరారు చేసి ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈసినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి రానున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే అధికారిక ప్రకటన రాలేదు కానీ మ్యాగ్జిమమ్ 2024 పొంగల్ రేసులో దిగనున్నట్టు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ స్థాయిలో ఈసినిమాను నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఇంకా వీటితో పాటు పలు హీరోల సినిమాలు కూడా సంక్రాంతికి బరిలోకి దిగనున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఈలిస్ట్ లో ఇంకా ఎన్ని సినిమాలు క్యూ కడుతాయో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























