నాటు నాటు సాంగ్ ప్రజల హృద‌యాల‌ను గెలుచుకున్న పాట

Ram Charan Emotional Words About Naatu Naatu Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Global Star Ram Charan,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Latest News,Ram Charan Upcoming Movies,Ram Charan Latest Interview,Ram Charan Interview,RRR,RRR Movie,Ram Charan At Oscars 2023,Ram Charan Reveals Facts About Natu Natu Song,Ram Charan Facts About Natu Natu Song,Ram Charan About Naatu Naatu Song,Naatu Naatu Song,Naatu Naatu Song Oscar 2023,RRR Songs,RRR Movie Songs,Ram Charan Emotional Words About Naatu Naatu,Ram Charan About Naatu Naatu,Ram Charan Entertainment Tonight Show,Ram Charan Tonight Show,Ram Charan At Tonight Show,Ram Charan Tonight Show Interview

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. అవార్డు వేడుక కోసం ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్, చిత్రయూనిట్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా అక్కడే ఉండి పలు ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తాజాగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ టు నైట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* ‘నాటు నాటు’ సాంగ్ కేవలం RRR మూవీలోని పాట మాత్రమే కాదు. ఇది అంద‌రి పాట‌. ప్ర‌జ‌లంద‌రూ మెచ్చిన పాట‌. భిన్న సంస్కృతుల‌కు చెందిన వేర్వేరు వ‌య‌సుల‌కు చెందిన‌వారు పాట‌లోని సాహిత్యం అర్థం కాన‌ప్ప‌టికీ త‌మ పాట‌గా స్వీక‌రించారు. పాట బీట్ ఫుట ట్యాపింగ్‌గా అంద‌రూ మెచ్చేలా ఉంది. జపాన్ నుంచి యు.ఎస్ వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ పాట‌ను ఇష్ట‌ప‌డ్డారు. దీన్నంతా మూడో వ్య‌క్తిగా నేను గ‌మ‌నిస్తూనే ఉన్నాను. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. ఇంత కంటే గొప్ప‌గా ఏదీ కోరుకోను.

* ఉక్రెయిన్‌లోని ప్రెసిడెంట్స్ ప్యాలెస్ ముందు వారం రోజుల పాటు నాటు నాటు పాట‌ను రిహార్స‌ల్ చేశాం. అక్క‌డి ప్రెసిడెంట్ కూడా ఓ న‌టుడే. కాబ‌ట్టి ఆయ‌న అక్క‌డ షూటింగ్ చేసుకుంటామ‌నే మా అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించారు. పాట చిత్రీక‌ర‌ణ‌లో నూట యాబై మంది డాన్స‌ర్స్ సెట్‌లో పాల్గొన్నారు. ఇంకా 200 మంది యూనిట్ స‌భ్యులున్నారు. ఆ పాట‌ను చిత్రీక‌రించ‌టానికి 17 రోజుల స‌మయం ప‌ట్టింది. డాన్స్ చేసే క్ర‌మంలో చాలా రీటేక్స్ తీసుకున్నాం. నేనైతే నాలుగు కిలోల బ‌రువు త‌గ్గిపోయాను. ఆ కష్టం గురించి ఇప్పుడాలోచించినా నా కాళ్లు వ‌ణుకుతాయి.

* నా నుంచి, నా స‌హ న‌టుడు (ఎన్టీఆర్‌) నుంచి ఎలాంటి ఔట్ పుట్ రావాల‌నే దానిపై మా ద‌ర్శ‌కుడు (ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి) చాలా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు. మా డాన్స్ మూమెంట్స్ ల‌య బ‌ద్ధ‌త‌, ప్ర‌తీ ఫ్రేమ్ ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండాల‌ని మా డైరెక్ట‌ర్ చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉండేవారు. ఆయ‌న ఆ స‌మ‌యంలో మ‌మ్మ‌ల్ని ఎంత హింస పెట్టినా దానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ద‌క్కింది (న‌వ్వుతూ). నేను రాజ‌మౌళిగారితో ఎప్పుడు ప‌ని చేసిన నా బ్రెయిన్‌ని స్విచ్ ఆఫ్ మోడ్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఆయ‌న మ‌న‌సులో ఏముందో మ‌నం ఊహించ‌లేం. అలాగే ఆయ‌న ప‌నిలో ఆయ‌న చాలా నిష్ణాతుడు. ఓ టెక్నీషియ‌న్‌గా త‌న‌కేం కావాలో బాగా తెలుసు.

* త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతున్న ఆస్కార్ అవార్డ్స్ కార్య‌క్ర‌మం సంద‌ర్బంగా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. అలాగే తెలియ‌ని నెర్వ‌స్‌నెస్ ఉంది. ఓ న‌టుడిగా అక్క‌డ ఉంటానో లేక ఫ్యాన్ బాయ్‌గా ఉంటానో తెలియ‌టం లేదు. ఎందుకంటే నేను ఎవ‌రినైతే చూస్తూ పెరిగాను వారంద‌రినీ అక్క‌డ చూడ‌బోతున్నాను. అది తలుచుకుంటుంటేనే చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. కేట్ బ్లాంచెట్‌, టామ్ క్రూయిజ్‌ వంటి వారి సినిమాల‌ను చూస్తూ పెరిగాయి. టామ్ క్రూయిజ్ చాలా గొప్ప వ్య‌క్తి. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం వ‌స్తే చాలా గొప్ప‌. ఆయ‌నెంతో స్ఫూర్తిదాయ‌క‌మైన వ్య‌క్తి.

* ఆస్కార్ అవార్డుకి మా సంగీత ద‌ర్శ‌కులు ఎం.ఎం.కీర‌వాణిగారు అర్హులు. ఆయ‌న త‌న రంగంలో 27 ఏళ్లుగా ప‌య‌నిస్తున్నారు. ఇన్నేళ్ల‌కు ఆయ‌న‌కు ఆస్కార్ అవార్డ్ వ‌స్తుంది. కీర‌వాణిగారికి స‌పోర్ట్ చేయ‌టానికి ఓ కుటుంబంలాగా మేమంతా ఇక్క‌డ‌కు వ‌చ్చాం.

* RRR గొప్ప క‌ళాత్మ‌క చిత్రం.. దీని ప‌రంగా మాకు ఆశించిన దాని కంటే ఎక్కువ ప్రేమ‌, అభినంద‌న‌లు ద‌క్కాయి. ఇప్పుడేదైతే ద‌క్కుతుందో అదంతా అద‌నం. మేం ఈ క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తున్నాం. మక్కా ఆఫ్ సినిమా అయిన‌ హాలీవుడ్ మ‌మ్మ‌ల్ని రిసీవ్ చేసుకున్న తీరు ఎంతో గొప్ప‌గా ఉంది. మారు స‌హృద‌యంతో ఆద‌రించారు. మంచి సినిమాకు భాష‌తో ప‌ని లేదు. RRR అందుకు ఒక మంచి ఉదాహ‌ర‌ణ‌. ఇలాంటి గొప్ప క్ష‌ణాల్లో నా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిగారితో భాగ‌మైనందుకు ఎంతో గొప్ప‌గా, ఆనందంగా ఉంది.

* భిన్న సంస్కృతులతో కూడిన ఆడియెన్స్ ఎంత‌గానో ఇష్ట‌ప‌డే ఫ్రాంచైజీ చిత్రాల్లో నేను భాగం కావాల‌నుకుంటున్నాను. ఇప్పుడు సినిమా గ్లోబ‌ల్ అయ్యింది. సినిమాకున్న హ‌ద్దుల‌న్నీ చెరిగిపోతున్నాయి. ఇలాంటి సినీ గ్లోబ‌లైజేష‌న్ స‌మ‌యంలో నేను సినీ ఇండ‌స్ట్రీలో ఉండ‌టం అదృష్టంగా భావిస్తున్నాను.

* నేను హాలీవుడ్‌లో చాలా మంది ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేయాల‌నుకుంటున్నాను. వారిలో జె.జె.అబ్ర‌మ్స్ ఒక‌రు. క్వెన్టిన్ ట‌రాన్టినో నాకు ఎంతో ఇష్ట‌మైన‌ దర్శకుడు. ఆయ‌న డైరెక్ట్ చేసిన వార్ మూవీ ఇన్‌గ్లోరియ‌స్ బాస్టర్ట్స్ నా ఆల్ టైమ్ ఫేవ‌రేట్ మూవీ. ఆయ‌న నాపై ఎంతో ప్ర‌భావాన్ని చూపారు. ఈ ద‌ర్శ‌కులు వారితో ప‌ని చేసే న‌టుల‌కు స‌వాలు విసురుతుంటారు.

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 12 =