గత ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం మరో థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా విరూపాక్ష సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆధ్యాత్మికత, మూఢ నమ్మకాల మధ్య ఈ కథ సాగుతుందన్న విషయం టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇక టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తుండటంతో.. ఈ టీజర్ యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. రిలీజ్ అయి రెండు మూడు రోజులు అవుతున్నా ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: