అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకొని నిజంగానే అందాల రాక్షసిగా ప్రశంసలు అందుకుంది. ఇక ఆతరువాత వరుస సినిమాలు క్యూ కట్టగా.. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అయితే లావణ్యకు సక్సెస్ మాత్రం కాస్త తక్కువగానే దక్కిందని చెప్పొచ్చు. మధ్యలో కాస్త సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. ఇప్పుడు మళ్లీ పుంజుకొని సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా పెళ్లిపై లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రతి ఒక్కరూ తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారని, టైమ్ వచ్చినప్పుడు అదే జరుగుతుందని చెప్పింది. అసలు పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేయడం లేదని.. తాను కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదని.. పెళ్లికి సంబంధించిన కలలు తనకు లేవని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే అని తెలిపింది. పెళ్లి మీద తనకు నమ్మకం ఉందని… నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి జరుగుతుందని చెప్పింది. వ్యక్తిగత విషయాల గురించి బయటకు చెప్పడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది.
ఇక ఇటీవలే తాను పులి-మేక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పులి మేక వెబ్‌సిరీస్ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆది సాయికుమార్ కూడా కీలక పాత్రలో నటించిన ఈసిరీస్ ను కోన ఫిలిం కార్పొరేషన్, జీ5 సంయుక్తంగా నిర్మించాయి. ఈ వెబ్ సిరీస్ కు మాత్రం మంచి రెస్పాన్సే వచ్చింది. మరోవైపు పలు సినిమాలు కూడా లావణ్య త్రిపాఠి లైన్ లో ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: