దసరా – చమ్కీల అంగీలేసి సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nani Dasara Movie Third Single Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Movie Updates,Dasara Telugu Movie Latest News,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani New Movie Update,Nani Latest Movie Update,Dasara Movie Third Single Release Date,Nani Dasara Movie Third Single Release Date,Dasara Movie Third Single,Dasara Movie Third Single Update,Dasara Movie Third Song,Dasara Songs,Dasara Movie Songs,Dasara Telugu Movie Songs,Dasara Movie Third Song Update,Chamkeela Angeelesi,Chamkeela Angeelesi Song,Chamkeela Angeelesi Song Promo,Dasara Chamkeela Angeelesi,Dasara Chamkeela Angeelesi Song,Keerthy Suresh

న్యాచురల్ స్టార్ నాని హీరగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. తెలంగాణ‌లోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతోన్నారు. ఈసినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు మేకర్స్. ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేశారు. ధూమ్ ధామ్ దోస్తానా, ఓరి వారి పాటలను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. చమ్కీల లుంగీలేసి అనే మూడో పాట రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈ పాటను మార్చి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − nine =