గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

Gopichand 31 Movie Launched Today,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Gopichand 31,Gopichand 31 Movie,Gopichand 31 Telugu Movie,Gopichand 31 Movie Updates,Gopichand 31 Telugu Movie Latest News,Gopichand 31 Movie Launched,Gopichand 31 Launched,Gopichand 31 Movie Opening,Gopichand 31 Movie Pooja Ceremony,Gopichand 31 Movie Pooja,Gopichand 31 Movie Launch,Gopichand 31 Launch,Gopichand 31 Launch Ceremony,Gopichand,Gopichand Movies,Gopichand New Movie,Gopichand Latest Movie,Gopichand Upcoming Movie,Gopichand New Movie Launch,Gopichand New Movie Update,Gopichand Latest Movie Update

ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. ఆతరువాత విలన్ గా కూడా చేసి తన టాలెంట్ చూపించి అందర్నీ మెప్పించి.. ఆ తరువాత యాక్షన్ హీరోగా మారిన నటుడు గోపీచంద్. తన కెరీర్ లో పలు డిఫరెంట్ కథలతో అలరించాడు.. అలరిస్తూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు చాాలా ఏళ్లు సరైన హిట్ లేక వెనకపడిపోయాడు. అయినా కూడా నిరాశ చెందకుండా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ఆమధ్య సీటీమార్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే జోష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. జగపతిబాబు కూడా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఈసినిమా వస్తుంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈసినిమా పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్‌ కాగా, కేజీఎఫ్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఇతర నటీనటులు, టెక్నికల్‌ టీం వివరాలను తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − three =