భద్రం కొడుకో (1992 ) మూవీలో బాలనటి గా టాలీవుడ్ కు పరిచయం అయిన లయ, స్వయంవరం(1999 ) మూవీతో కథానాయికగా మారారు. మనోహరం, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, ప్రేమించు, శివరామరాజు వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం అభినయంతో లయ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కన్నడ, తమిళ, మలయాళ భాషల కొన్ని సినిమాలలో లయ నటించారు. సినిమాల్లో బిజీగా ఉండగానే లయ పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. వివాహనంతరం నటనకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ.. తెలుగు సూపర్ హిట్ సాంగ్స్‌కు తనదైన స్టైల్‌లో డ్యాన్సు చేస్తూ ఆ వీడియోస్ ను షేర్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో లయ మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2006లో శ్రీ గణేష్‌తో లయ వివాహం జరిగింది. తమ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌ని ఆహ్వానించేందుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ కు శుభలేఖ ఇవ్వగా పవన్ ఆహ్వానించిన తీరు, శుభలేఖ తీసుకుని.. కచ్చితంగా వస్తానని ఆయన చెప్పిన తీరు చూసి ఆశ్చర్య పోయాననీ.. మా పెళ్లి వేడుకకు అందరి కంటే ముందు పవన్ వచ్చి మమ్మల్ని సర్‌ప్రైజ్ చేశారనీ.. ఎలాంటి హడావిడి, హంగామా లేకుండా ఆయన చాలా సింపుల్‌గా రావడం చూసి షాక్ అయ్యాననీ.. అన్నయ్య (చిరంజీవి)ను కూడా పిలిచావు కదమ్మా. ఆయన దారిలో ఉన్నారు.. వస్తున్నారు అని మాతో చెప్పారనీ చెప్పారు. చిరంజీవి గారితో పరిచయం ఉండటంతో పెళ్ళికి వచ్చారంటే ఓ అర్థం ఉందనీ.. పరిచయం లేని తన పెళ్లికి పవన్ కళ్యాణ్ గారు రావాల్సిన అవసరం లేదనీ.. అయినా వచ్చారంటే ఆయన వ్యక్తిత్వమేంటో అర్థమవుతుందనీ పవర్‌స్టార్‌పై లయ ప్రశంసలు కురిపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై లయ ఆసక్తికర వ్యాఖ్యలకు మెగా అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: