ఉస్తాద్- శ్రీసింహా ఫస్ట్ లుక్ రిలీజ్

First Look Out From Sri Simhas Ustaad Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ustaad New Movie,Ustaad Movies,Ustaad Upcoming Movie,Ustaad Latest Movie,Ustaad Movie Updates,Ustaad Latest Movie News,Ustaad New Movie Update,Ustaad Latest Movie Update,Ustaad,Sri Simhas Ustaad Movie Updates,Sri Simhas Ustaad First Look Released,Sri Simhas Ustaad First Look Out,Sri Simhas Ustaad First Look Revealed,Ustaad Movie First Look Discolosed, Ustaad Movie First Look Divulged

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇద్దరు తనయులు కూడా ఇండస్ట్రీలో నే కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే కదా. పెద్ద కుమారుడు కాలభైరవ ఇప్పటికే తండ్రి బాటలోనే మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా మారాడు. మత్తు వదలరా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఉస్తాద్ సినిమా కూడా ఒకటి. ఫణిదీప్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు శ్రీసింహా పుట్టినరోజు సందర్భంగా ఉస్తాద్ సినిమా నుండి తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈసినిమాలో పైలెట్ గా నటించనున్నట్టు తెలిపారు మేకర్స్. తన కలలకు రెక్కలు తొడిగి చిన్న పట్టణం నుంచి ఆకాశం వరకు ఎదిగిన నిర్భయమైన పైలట్ ను కలవండి’ అంటూ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చింది చిత్ర బృందం.

కాగా వారాహి చలన చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అకీవా బి సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ స‌హా ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − nine =