100 నాణెం పై నట సార్వభౌముడు

Nandamuri Taraka Rama Rao Image On Rs 100 Coin,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates,Telugu Movie Updates,NTR,Sr NTR,Sr NTR Movies,Sr NTR Best Movies,Sr NTR Hit Movies,Sr NTR Image On Rs 100 Coin,Legend NTR On RBI's Silver 100 Rs Coin,NTR On RBI's Silver 100 Rs Coin,NTR On Silver 100 Rs Coin,New Sr NTR 100 Rs Coin To Be Launched,RBI Green Signal To Sr NTR Photo On Rs 100 Coin Says Daggubati Purandeswari,Sr NTR Photo On Rs 100 Coin,Sr NTR Picture On Rs 100 Coin,Rs 100 Coin,Daggubati Purandeswari,Purandeswari,NTR's Image On Rs100 Coin,NTR 100 Rupees Coin,Sr NTR 100 Rupees Coin,Process Started For NTR Image On Rs 100 Coin,NTR Image On Rs 100 Coin,NTR On Currency,RBI Green Signal to Sr NTR Image on 100 Rupee Coin,RBI Green Signal to NTR Image on 100 Rupees Coin,NTR Image On Rs 100 Silver Coins,NTR Image Soon On Rs 100 Coin,NT Rama Rao,Late NTR Image On 100 Rupee Coin,Senior NTR,Nandamuri Taraka Rama Rao,Sr NTR Coin

తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసిన వారిలో ఎంతోమంది ఉండగా అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి. తెలుగు సినీ చరిత్రలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు అనేకం. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు… యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘిక, పౌరాణిక ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నట్టు ఉంటుంది. సినీ చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. అలాంటి నటుడు ఇంత వరకూ రాలేదు.. ఇకపై కూడా అలాంటి నటుడిని చూడటం అనేది జరగదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఆయన ప్రభంజనంసృష్టించారు. తెలుగువారి గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని సైతం స్థాపించి కేవలం పార్టీ పెట్టిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాంటి నట సార్వభౌముడికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్ అందించిన సేవలకు గుర్తుగా.. ఆయన బొమ్మతో రూ.100 కాయిన్ ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. వెండితో ఈ కాయిన్ తయారు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈ విషయాన్ని ప్రకటించినా మింట్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరిని కలిసి ఆమె సలహాలను కోరారు. పురంధరేశ్వరికి కాయిన్ నమూనాను అధికారులు చూపించారు. ఇక త్వరలోనే వంద రూపాయల ఎన్టీఆర్ బొమ్మతో కూడిన నాణేన్ని భారత ప్రభుత్వం విడుదల చేయనుంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ఈ ఏర్పాట్లు ఇంకా ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి నిజంగా ఎన్టీఆర్ కు ఇంత గౌరవం దక్కడం తెలుగు ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =