హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాంతార మూవీకి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది. బ్లాక్ బస్టర్ కాంతార మూవీకి ప్రీక్వెల్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణంగా శివరాత్రి సమయంలో ప్రజలు రాత్రి జాగరణ చేస్తూ ఉంటారు. కొంతమంది భక్తితో శివ నామస్మరణ చేస్తూ రాత్రంతా జాగారం చేస్తుంటే సినిమా ప్రేమికులు మాత్రం శివరాత్రి జాగరణ పేరుతో సినిమాలు చూస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో శివరాత్రి పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే శివరాత్రికి మిడ్ నైట్ షోస్ ప్రదర్శిస్తూ ఉంటారు. గత ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన కాంతార సినిమాని తెలుగు ప్రేక్షకుల కోసం శివరాత్రి రోజున స్పెషల్ షోస్ ప్రదర్శించనున్నారని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: