హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. కాంతార మూవీకి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార మూవీ హిందీ వెర్షన్ అక్టోబర్ 14న రిలీజ్ అయ్యి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ మూవీ పై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ లో 95 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కాంతార మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా కాంతార మూవీ 100 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఇటీవలి కాలంలో వారం, పది రోజులు థియేటర్లలో సినిమా ఆడటమే కష్టంగా ఉంది. అలాంటిది హిందీ డబ్బింగ్ వెర్షన్ వంద రోజులు ఆడటంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: