కోలీవుడ్ లో విలన్ గా సునీల్ బిజీ

Sunil Becomes Busy in Tamil Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Sunil,Sunil Latest News,Sunil Upcoming Movie News,Sunil New Movie News,Sunil Next Project News,Sunil Latest Film Details

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన సునీల్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ కమెడియన్ గా మారారు. అందాలరాముడు మూవీతో హీరోగా మారి సునీల్ సూపర్ హిట్ మర్యాద రామన్న, పూల రంగడు వంటి సినిమాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సునీల్ హీరోగా తెరకెక్కిన కొన్ని సినిమాలు పరాజయం పాలవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కలర్ ఫోటో సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి సునీల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తరువాత రవితేజ డిస్కో రాజాలో విలన్ గా చేశారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ సినిమాలో సునీల్ చేసిన పవర్ ఫుల్ విలనీ రోల్ అతని ఇమేజ్ ని అమాంతం మార్చేసింది. అందులో సునీల్ పెర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప సినిమా క్రేజ్ తో ఇప్పుడు సునీల్ కోలీవుడ్ లో కూడా బిజీగా మారారు. ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ సినిమాలో పవర్ ఫుల్ విలనీ రోల్ లో, శివకార్తికేయన్ మావీరన్ సినిమా విలన్ గా, కార్తి పీరియాడిక్ కామెడీ ఎంటర్టైనర్ జపాన్ లో కూడా సునీల్ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించనున్నారు. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న మార్క్ ఆంటోనీ సినిమాలో కూడా పవర్ ఫుల్ విలన్ గా సునీల్ నటిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా కొన్ని బాలీవుడ్ సినిమాలలో కూడా సునీల్ ని విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =