తెలుగు నిర్మాతలు ఒకపక్క ఇక్కడ సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర లాంగ్వేజస్ లో హిట్ సినిమాలను సైతం ఇక్కడ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా టాప్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్స్ట్ అధినేత అల్లు అరవింద్ ఇప్పటికే పలు సినిమాలను తెలుగులో రిలీజ్ చేశారు. రీసెంట్ గానే కాంతార సినిమాను రిలీజ్ చేయగా అది ఇక్కడ కూడా ఎంత హిట్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు మరో మలయాళ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విష్ణు శశి శంకర్ దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో ఉన్ని కృష్ణన్ ప్రధానం పాత్రలో వచ్చిన సినిమా మాలికాపురం. ఈసినిమా గత ఏడాది డిసెంబర్ 30 వ తేదీన వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు ఇక్కడ కూడా. దీనిలో భాగంగానే ఈసినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే అయ్యప్పన్ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుందన్న విషయం అర్థమవుతుంది. అయ్యప్ప భక్తుడైన ఉన్నిముకుందన్. బాలికను శబరిమల తీసుకుని వెళతాడు. మార్గమధ్యంలో అడవుల్లో ఏం జరిగింది.. స్త్రీలకు శబరిమలలో ఎంట్రీ ప్రవేశం నిషేదం అనే కీలక పాయింట్ తో కథాంశాన్ని తెరపైకి తెచ్చారు. మరి మలయాళంలో హిట్ అయిన ఈసినిమా ఇక్కడ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూద్దాం..
Experience the Malayalam Sensational Divine Hit #Malikappuram in theaters from 𝐉𝐀𝐍 𝟐𝟔!✨
Telugu Trailer – https://t.co/sW8cah18UA
A #GeethaFilmDistributors Release in AP/TG#AlluAravind @Iamunnimukundan #VishnuSasiShankar #AbhilashPillai #KavyaFilmCompany #AanMegaMedia pic.twitter.com/RW4LZm9IQf
— Geetha Arts (@GeethaArts) January 19, 2023
కాగా ఇంకా ఈసినిమాలో మాలికాపురంలో సజ్జు కురూప్, మనోజ్ కే జయన్, రంజి పానికర్, రమేశ్ పిషరోడి ఇతర కీలక పాత్రలు పోషించారు. రజినీ రాజ్ సంగీతం, విష్ణు నారాయణన్ నంబూతిరి సినిమాటోగ్రఫి అందించారు. అంటోన్ జోసెఫ్ యాజమాన్యంలోని యాన్ మెగా మీడియా మరియు వేణు కున్నపిల్లి యాజమాన్యంలోని కావ్య ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మించాయి. జనవరి 26వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























