త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. రవితేజ, శ్రీలీల ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ సినిమాలో బీమ్స్ సిసిరోలియో సంగీతం కూడా ఈసినిమా సక్సెస్ లో ముఖ్య భూమిక పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బీమ్స్ అందించిన పాటలు ఆ పాటలకు రవితేజ, శ్రీలీలలు వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు సినిమా విజయానికి తోడ్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ అయి రెండు వారాలు అయిపోయింది. రిలీజ్ అయిన రోజు నుండే ఈసినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పై కూడా దాని ప్రభావం పడింది. రోజు రోజుకూ ఈసినిమా కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. ఫైనల్ గా ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో చిత్రయూనిట్ కూడా ఫుల్ ఖుషీలో ఉంది. ఇక ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా ఈసినిమా తన సత్తాను చూపిస్తుంది. యూఎస్ లో 6 లక్షల డాలర్స్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. సంక్రాంతికి సినిమాలు విడుదల కావడంతో అప్పటివరకూ సరైన సినిమాలు లేకపోవడంతో రవితేజ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు.
MassMaharaja @RaviTeja_offl ‘s Bombarding 1️⃣0️⃣0️⃣ CR+.. Reverberating Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka
Book your tickets nowhttps://t.co/LhkQzGAJ8s@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada @peoplemediafcy pic.twitter.com/xN9zyFfxTt
— Telugu FilmNagar (@telugufilmnagar) January 6, 2023
కాగా ఈసినిమాలో సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























