బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 ప్రభాస్ ఎపిసోడ్ 2 ప్రోమో రిలీజ్

Unstoppable With NBK Prabhas Episode Part 2 Promo Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Unstoppable With NBK Prabhas Episode Part 2 Promo,Unstoppable With NBK Prabhas Episode,Prabhas Episode,Unstoppable With NBK,NBK,Prabhas

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్, యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయదానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మొదటి భాగం 29 వ తేదీ రాత్రి 9 గం. లకు ప్రసారం చేయగా, హీరో ప్రభాస్ ఫ్యాన్స్ సందడికి ఆ యాప్ క్రాష్ అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి ఎపిసోడ్ పలు సరదా సరదా ప్రశ్నలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో కొనసాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్ కు భారీ స్పందన లభిస్తుంది. ఈ ఎపిసోడ్ 100 మిలియన్లకు పైగా వ్యూయింగ్ మినిట్స్ ను నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ స్టాపబుల్2 ప్రభాస్ ఎపిసోడ్ రెండో భాగం జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ప్రభాస్ ఎపిసోడ్ 2 ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో ప్రభాస్ మరింత సరదాగా బాలయ్యతో ఫన్ చేస్తూ కనిపించారు. అటు తన స్నేహితుడు గోపీచంద్‌ను ఏది చెప్పినా పూర్తిగా చెప్పాలని ప్రభాస్ కోరారు. బాహుబలి తరువాత ప్రభాస్ మైండ్‌సెట్ ఏమిటని బాలయ్య ప్రశ్నించగా.. స్టైలిష్ ఎంటర్ టైనర్ సాహో మూవీ కోసం తాము ఎంతగా కష్టపడ్డారో ప్రభాస్ చెప్పారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో ఈ పార్ట్ 2 పై మరింతగా అంచనాలు పెంచేసింది. ప్రభాస్ ఎపిసోడ్ 2 కై అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 2 =