సంక్రాంతి ఫీష్ట్ కు పుష్ప 2 మేకర్స్ రెడీ?

Pushpa 2 Team To Surprise Audience for this Sankranti,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Pushpa 2,Pushpa 2 Movie,Pushpa 2 Telugu Movie,Pushpa 2 Movie Updates,Pushpa 2 Telugu Movie Latest News,Allu Arjun.Rashmika Mandanna,Pushpa 2 Live Updates,Pushpa 2 Latest Update

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది ఈసినిమా. అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ తెచ్చి పెట్టింది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిపారు. ఇక కొత్త షెడ్యూల్ ను జనవరి 7వ తేదీ నుండి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. హైద్రాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ షూటింగ్ జరగనున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా షూటింగ్ సంగతి పక్కన పెడితే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా నుండి ఏదో ఒక అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి న్యూ ఇయర్ కే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ వస్తుందేమో అని ఈగర్ వెయిట్ చేశారు. కానీ మేకర్స్ కనీసం ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికి సంక్రాంతి ఫీష్ట్ ఇవ్వడానికి మేకర్స్ సిద్దమవుతున్నారట. సంక్రాంతికి దేశవ్యాప్తంగా పలు భాషల్లో పవర్ ఫుల్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారట. మరి అదే కనుక నిజమైతే సంక్రాంతి పండుగకు పుష్పరాజ్ ఫ్యాన్స్ కు అసలైన ట్రీట్ అందినట్టే అని చెప్పొచ్చు. చూద్దాం మరి ఏదైనా అప్ డేట్ వస్తుందా?లేదా? అని

కాగా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు పార్ట్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − four =