అంతర్జాతీయ వేదికపై బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్న రాజమౌళి

SS Rajamouli Received The Best Director Award In New York Film Crictics Circle,SS Rajamouli Wins Best Director for RRR,SS Rajamouli Wins The Best Director Award For RRR At NYFCC,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,SS Rajamouli Wins The Best Director Award For RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,Rajamouli,SS Rajamouli,Rajamouli Latest News, Best Director Award For RRR At NYFCC,Jr NTR,Ram Charan,Best Director Award For RRR,NYFCC,NYFCC Latest News,New York Film Crictics Circle

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. దీంతో ఈసినిమాకోసం పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అవార్డుల సంగతి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ అవార్డులు మాత్రమే కాకుండా అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టుకుంటుంది. హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది. ఆతరువాత సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా నిలిచింది. ఇటీవలే ఆస్కార్ అవార్డ్స్‌కి కూడా బెస్ట్ సాంగ్ కేటగిరీలో నామినేట్ కూడా అయ్యింది. ఇక ఇప్పుడు మరో అవార్డును రాజమౌళి సొంతం చేసుకున్నారు. ఇటీవలే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ నామినేషన్స్ లో రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో ఎంపికైన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ అవార్డుల పురస్కారాలు నిన్న ఘనంగా జరిగాయి. ఈనేపథ్యంలో తాజాగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు రాజమౌళి.

ఈసందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ.. ప్రేక్షకులు, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాపై అభిమానులు చూపించిన ఆదరణను మాటల్లో చెప్పలేనన్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలైన సమయంలో అభిమానులు, ప్రేక్షకుల్లో కనిపించిన ఆనందం, ఆశ్చర్యం ఎప్పటికీ మర్చిపోలేనని.. ఆడియన్స్ అలా ఫీలయ్యేలా చేయడమే తనకిష్టమని చెప్పారు. అన్నింట్లో తనకి అండగా ఉన్న తన కుటుంబానికి కూడా రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకకు రాజమౌళి, తన సతీమణి రమా రాజమౌళి, కార్తికేయ, బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ సతీసమేతంగా హాజరయ్యారు.

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =