తమిళ్ స్టార్ హీరో విజయ్ ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈఏడాది సంక్రాంతికి వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత విజయ్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈసినిమాను లోకేష్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో విజయ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించనున్నాడట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ అయితే ఫుల్ స్వింగ్ లో చాలా సైలెంట్ గా జరుపుతున్నట్టు.. చెన్నైలోని ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లలో ఈసినిమా షూటింగ్ జరుపుతున్నారట. కాగా ఈసినిమాలో స్టార్ డైరెక్టర్ గౌతమ్, మన్ సూర్ ఖాన్ ఇప్పటికే ఈసినిమాలో భాగమవ్వగా.. ఇంకా త్రిష, అర్జున్, సంజయ్ దత్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: