వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య బూమ్ బద్దలు రికార్డ్ లు సృష్టిస్తాయి

Ramajogayya Sastry About Veera Simha Reddy And Waltair Veerayya Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Ramajogayya Sastry,Ramajogayya Sastry Latest News,Ramajogayya Sastry About Veera Simha Reddy,Ramajogayya Sastry Comments On Veera Simha Reddy,Ramajogayya Sastry Sensational Comments On Veera Simha Reddy,Ramajogayya Sastry About Waltair Veerayya,Ramajogayya Sastry Comments On Waltair Veerayya,Ramajogayya Sastry Sensational Comments On Waltair Veerayya,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Telugu Movie Latest News,Chiranjeevi,Shruti Haasan,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Telugu Movie Latest News,Balakrishna,Devi Sri Prasad,Thaman S

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ‘వీరసింహారెడ్డి’లో అన్ని పాటలకు (సింగిల్ కార్డ్), ‘వాల్తేరు వీరయ్య’లోని ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ పాటకు సాహిత్యం అందించారు ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ పాట గురించి చెప్పండి ?
ఈ లిరిక్స్ లో సౌండింగ్ సరదా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ తో చెప్పాను. దాని చుట్టూ ఒక కాన్సెప్ట్ అనుకొని ఒక ట్యూన్ ఇచ్చారు. పాట చాలా అద్భుతంగా వచ్చింది.

ఈ రెండు సినిమాల్లో యాక్టర్ గా ఎక్కడైనా మెరిశారా?
‘వీరసింహారెడ్డి’ మా బావ మనోభావాలు పాటలో ఓ చోట కనిపిస్తా.

సంక్రాంతి సినిమాలన్నిటికీ లిరిక్స్ రాశారు కదా.. ఈ సంక్రాంతి మీదే అనిపిస్తోంది ?
అనుకుంటే జరగదు. అలా కుదిరిందంతే.

చాలా పాటలు రాస్తూనే వుంటారు కదా.. ఎక్కడైనా రైటర్స్ బ్లాక్ ఉంటుందా ?
అలా ఏమీ వుండదు. ఇన్నాళ్ళ అనుభవంతో టెక్నిక్, అలవాటు ప్రకారం కంటెంట్ ఇవ్వడం జరిగిపోతుంది. అయితే గొప్ప పాట రావాలి, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కావాలంటే మాత్రం కొంత సమయం పడుతుంది.

‘వీరసింహారెడ్డి’, వాల్తేరు వీరయ్యలో అలా నెక్స్ట్ లెవల్ కంటెంట్ అనుకునే పాటలు ఏమిటి ?
‘వీరసింహారెడ్డి’, వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకంగా వుంటుంది. పెద్ద సినిమాలకి వచ్చేసరికి కావాల్సిన సమయం ఇస్తారు. పైగా అఖండ సినిమాకి రాయలేదు. ఆ పట్టుదల వుంటుంది. క్రాక్ తర్వాత గోపీచంద్ తో మళ్ళీ కలసి చేస్తున్నాను. ‘వీరసింహారెడ్డి సింగిల్ కార్డ్ రాశాను. మొదటి నుండి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత బలంగా రాసే అవకాశం వుంటుంది. తమన్ తో కలసి అన్ని పాటలు అద్భుతంగా చేశాం. విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నాలుగో పాట కూడా అంతకు మించి వుంటుంది.

సింగిల్ కార్డ్ రాస్తున్నపుడు మీ పై ఒత్తిడి ఉంటుందా ?
సింగిల్ కార్డ్ అయినా.. ఒక్క పాట అయినా.. దర్శకుడి కల కోసమే గేయ రచయిత పని చేస్తాడు. దర్శకుడు విజన్ కి తగట్టు అడుగులు వేయడంలోనే గేయ రచయిత గొప్పదనం వుంటుంది. అయితే సింగిల్ కార్డ్ రాయడంలో ఒక సౌలభ్యం వుంటుంది. పాటలన్నీ ఒకరే రాస్తారు కాబట్టి ఏ పాటలో ఎలాంటి మాట వాడాం, ఏ భావం చెప్పాం.. ఫ్లో సరిగ్గా వుందో లేదో చెక్ చేసుకునే అవకాశం వుంటుంది. ఆరు పాటలు ఆరుగురు రాస్తే మాత్రం.. ఈ కోర్డినేషన్ పని దర్శకుడు చూసుకోవాల్సివస్తుంది.

పెద్ద హీరోల సినిమాలకి రాస్తున్నపుడు అభిమానుల అంచనాలు అందుకోవడం సవాల్ గా ఉంటుందా ?
ప్రతి పాటకు సవాల్ వుంటుందండీ. ఉదాహరణకు ఒక ప్రేమ పాటే రాస్తున్నాం అనుకోండి. మనమే ఇప్పటికి బోలెడు ప్రేమ పాటలు రాసుంటాం. ఈ పాటలో ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి ఖచ్చితంగా వుంటుంది. బాలయ్య గారికి ఇదివరకే కొన్ని పాటలు రాశాం. ఈ సారి ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి, సవాల్ వుంటుంది.

మా బావ మనోభావాలు ఐడియా ఎవరిది ?
మా బావ మనోభావాలు ఐడియా నాదే. ఒకసారి తమన్ తో చెబితే దాచి పెట్టమని చెప్పాడు. తర్వాత దర్శకుడు గోపీచంద్ కి చెప్పడం, పాట చేయడం జరిగింది. మనోభావాలు అందరూ సమకాలీనంగా వాడే మాటే.

మాస్ మొగుడు పాట గురించి ?
మాస్ మొగుడు పాట మంచి ఊపుతో వుంటుంది. క్లైమాక్స్ కి తగ్గట్టుగా వుంటుంది.

‘వీరసింహారెడ్డి’, వాల్తేరు వీరయ్య సినిమాలు ఎలా వుండబోతున్నాయి ?
‘వీరసింహారెడ్డి’, వాల్తేరు వీరయ్య రెండూ సినిమాలు ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ తో పాటు మంచి మ్యూజికల్ ట్రీట్ ఇస్తాయి. ఈ రెండు చిత్రాలు బూమ్ బద్దలు రికార్డ్ లు సృష్టిస్తాయి.

బాలకృష్ణ, చిరంజీవి గారి పాటలు రాస్తున్నపుడు ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు ? వాళ్ళ నుండి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్స్ ?
బాలకృష్ణ, చిరంజీవి గారి ఇమేజ్ పాట రాయడానికి ఒక ఊతమిస్తుంది. కొన్ని మాటలు వాళ్ళ ఇమేజ్ కే రాయగలం. చిరంజీవి గారికి రాసిన పాట విని చాలా బావుందని అన్నారు. అలాగే మనోభావాలు పాట షూటింగ్ జరిగినప్పుడు సెట్ కి వెళ్లాను. బాలకృష్ణ గారు కూడా బావుందని అభినందించారు. మనోభావాలు పాట విజువల్ గా కూడా చాలా కిక్ ఇచ్చింది.

ట్యూన్ కి లిరిక్స్ రాస్తారా ? లిరిక్స్ కి ట్యూన్ చేస్తారా ?
సంగీత దర్శకుడికి, లిరిక్ రైటర్ కి కేంద్ర బిందువు దర్శకుడు. ఆయన కథ, సందర్భం, విజన్ కి తగ్గట్టు పని చేయాల్సి వుంటుంది. ఎక్కవ సమయాల్లో ట్యూన్ కె లిరిక్స్ రాస్తాను.

యువ గేయ రచయితలకు మీరు ఇచ్చే సలహా ?
మనలో ఆసక్తి, పాటకు రాసే లక్షణం వుందో లేదో చూసుకోవాలి. కొందరు చాలా మంచి కవిత్వం రాసే ప్రతిభ కలిగివుంటారు. కానీ ఇక్కడ ట్యూన్ కి రాయడం ప్రధానం. అలాగే కొన్ని సార్లు ట్యూన్ లేకుండా కూడా రాయాలి. ఎంతగొప్పగా రాసినా సింపుల్ గా రాయడం ఇక్కడ ప్రధానం. బాగా చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు, పట్టుదల సహనం వుండాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here