మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ పుష్ప:ది రైజ్ మూవీ రష్యాలో డిసెంబర్ 8 వ తేదీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈమూవీ అక్కడ 25 రోజులకు పది మిలియన్ రూబెల్స్ను వసూలు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1.1 కోట్లు అన్నమాట. అయితే ఈ రేంజ్లో బాహుబలి 2 కూడా సాధించలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. బాహుబలి 2 మూవీ కలెక్షన్స్ ను దాటుకుని పుష్ప:ది రైజ్ మూవీ రష్యాలో హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























