వీర సింహారెడ్డి :సుగుణ సుందరి :మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీరసింహారెడ్డి సెకండ్ సింగిల్ సుగుణ సుందరి లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. స్టార్టింగ్ బీట్ నుంచే బాలయ్య మరియు శృతి హాసన్ లు అదిరే డాన్స్ స్టెప్స్ తో థ్రిల్ చేయగా వారు ఇద్దరు కూడా మరింత స్టైలిష్ గా ఇందులో కనిపిస్తున్నారు. థమన్ స్వరకల్పనలో రామ్ మిరియాల , స్నిగ్ధ శర్మ ఆలపించిన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ కాగా ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
వాల్తేరు వీరయ్య :నువ్వు శ్రీదేవి అయితే :మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ సాధిస్తుంది.
వాల్తేరు వీరయ్య సెకండ్ సింగిల్ ఫ్రాన్స్ దేశంలో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా అనే పల్లవితో ఫుల్ జోష్ తో సాగిన ఈ సాంగ్ ను దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో జస్ ప్రీత్ , సమీరా భరద్వాజ్ గానం చేసిన ఫ్రాన్స్ లో పలు అందమైన లొకేషన్స్ మధ్య శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ అత్యద్భుతంగా స్టెప్స్ వేసిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: