తమిళ , తెలుగు భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఉ మెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మాయ మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్ కనెక్ట్ తమిళ మూవీ డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు. పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నయన్ కనెక్ట్ మూవీతెలుగు వెర్షన్ ను రిలీజ్ చేస్తోంది. దీంతో ఈ సినిమాకు స్పెషల్ ప్రీమియర్ షో వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ రోజు డిసెంబర్ 20న AMB సినిమాస్‌లో నయనతార కనెక్ట్ మూవీని ప్రీమియర్స్ వేస్తున్నట్లు వారు తెలిపారు. దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కూడా నటిస్తుండటంతో కనెక్ట్ మూవీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: