మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. గోపిసుందర్ సంగీతం అందించారు. ఈ మూవీ కి అగ్ర దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లేను అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 మూవీ తరువాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
18 పేజెస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వేషన్ సెంటర్ లోమేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు.ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ… ఈ మూవీ కోసం డైరెక్టర్ సూర్య ప్రతాప్ దాదాపుగా నాలుగేళ్ళ వరకు ఆగి మరొక సినిమాకి కమిట్ కాలేదనీ , ఆ విధంగా ఈ మూవీ పట్ల ఆయనకు ఉన్న డెడికేషన్ చూస్తుంటే దీని కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అర్ధం చేసుకోవచ్చనీ , హీరో నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 మూవీ తో భారీ సక్సెస్ కొట్టి మంచి జోరు మీదున్నారనీ , అలానే తప్పకుండా 18 పేజెస్ మూవీ కూడా మంచి విజయం అందుకుని ఆయన కెరీర్ ని మరింతగా ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాననీ , దర్శకుడు సుకుమార్, అలానే బన్నీ వాసు ఇద్దరూ ఈ మూవీకి నిర్మాతలు అవడంతో తనకు ఈ మూవీ సొంత సినిమా వంటిదనీ ,ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుని మంచి సక్సెస్ అందుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: