లవ్ టుడే.. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో చూశాం. చిన్న బడ్జెట్, నో గ్రాఫిక్స్, ఇద్దరు ముగ్గురు తప్పా స్టార్ కాస్టింగ్ లేదు కేవలం కంటెంట్ ను నమ్ముకొని వచ్చిన సినిమా. ఈరోజుల్లో యువత ఫోన్ కు ఎలా ఎడిక్ట్ అయ్యారు.. స్మార్ట్ ఫోన్ వల్ల వచ్చే సమస్యలు ఏంటన్నది ఈసినిమా ద్వారా చూపించారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకొని తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని లాభాలను సైతం అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఈసినిమాను రీమేక్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమా హక్కులను కొనే ప్లాన్ లో వరుణ్ ధావన్ ఉన్నాడని.. తన తండ్రి డేవిడ్ ధావన్ ఈసినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈసినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడమే కాకుండా తానే దర్శకత్వం వహించడం విశేషం. ఈసినిమాలో ఇంకా సత్యరాజ్, రాధిక, యోగిబాబు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: