ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సెన్సేషన్

RRR Movie Creates New Record In Japan, RRR Movie New Record In Japan, RRR New Record In Japan, Rajamouli Movies, Rajamouli Latest Movie, Rajamouli Upcoming Movie, S. S. Rajamouli, Ajay Devgn, Ram Charan, NTR, Alia Bhatt, Olivia Morris, Shriya Saran, RRR, RRR 2022, RRR Movie, RRR Update, RRR Latest News, RRR Telugu Movie, RRR Movie Live Updates, RRR Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించి ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందిరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ఎంతో గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది ఈసినిమా. ఇంకా పలు అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఒక తెలుగు సినిమా ఇన్ని అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాను ఇటీవలే జపాన్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. జపాన్ లో మన హీరోలకు ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ఈనేపథ్యంలోనే వారం రోజులపాటు జపాన్ లో ప్రమాషన్స్ కూడా నిర్వహించారు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా జపాన్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా ఎన్నో ఏళ్లుగా ఉన్న రికార్డును చెరిపేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. జపాన్‌లో అత్యధిక గ్రాస్‌ సాధించిన ఇండియన్‌ మూవీగా ముత్తు సినిమాపై ఉన్న 24 సంవత్సరాల రికార్డును ఆర్ఆర్ఆర్ మూవీ బ్రేక్ చేసింది. ఇక ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జపాన్ లో ఈసినిమా 55 రోజుల్లో మొత్తం 410 మిలియన్ల జపాన్ యెన్స్ వసూలు చేసి బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా అయితే నిలిచింది. ఇక ఈ విషయాన్ని చిత్రయూనిట్ తెలియచేసింది.

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =