జిగర్ తండ సీక్వెల్ షురూ

Jigarthanda Sequel Official Announcement, Jigarthanda Official Announcement, Jigarthanda Sequel, Karthik Subbaraj’s Jigarthanda 2, Jigarthanda 2, Jigarthanda DoubleX, Raghava Lawrence, SJ Suryah, Karthik Subbaraj, Santhosh Narayanan, Raghava Lawrence Movies, Raghava Lawrence Latest Movie, Raghava Lawrence Upcoming Movie, Jigarthanda, Jigarthanda 2023, Jigarthanda Movie, Jigarthanda Update, Jigarthanda Latest News, Jigarthanda Telugu Movie, Jigarthanda Movie Live Updates, Jigarthanda Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పిజ్జా సినిమాతో పరిచయం అయిన కార్తీక్ సుబ్బరాజు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత జిగర్ తండ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు. ఈసినిమా తరువాత పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. జిగర్ తండ సినిమాలో సిద్దార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. అంతేకాదు బాంబీ సింహాకు నేషనల్ అవార్డు సైతం దక్కింది. ఇక ఈసినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. హారీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా గద్దల కొండ గణేష్ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా హిట్ ను అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ ను షురూ చేశాడు కార్తీక్ సుబ్బరాజు. ఈ సీక్వెల్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఈసినిమాకు జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ పెట్టి సినిమా కి సంబందించి చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ ను బట్టి ఈ సినిమా లో లారెన్స్ హీరో గా నటిస్తుండగా ఎస్ జే సూర్య కూడా మరో హీరో గా నటిస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ సీక్వెల్ కూడా హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. తిరునవుక్కరుసు సినిమాటోగ్రఫి అందించారు. ఈసినిమా షూటింగ్ ను మధురై లో మొదలుపెట్టనున్నారు. ఈసినిమాలో నటించే ఇతర నటీనటులు, ఇతర విషయాలను గురించి మరికొద్ది రోజుల్లో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =