దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత వచ్చిన ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. అంతేకాదు ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కూడా ఈసినిమా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంది. ఇక అంతర్జాతీయంగా కూడా ఈసినిమాకు ప్రత్యేకం గుర్తింపు లభించింది. ఇప్పటికే ఈసినిమాకు సాటర్న్ అమెరికన్ అవార్డ్ లభించింది. ఇంకా సన్ సెట్ సర్కిల్ అవార్జును సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు దర్శకుడు రాజమౌళికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. హాలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డును రాజమౌళి సొంతం చేసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డును అందుకున్నారు. అమెరికాలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలో రాజమౌళిపై ప్రశంసలు కురుస్తున్నారు అందరూ. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ ద్వారా కంగ్రాట్స్ తెలిపాడు. కంగ్రాట్స్ జక్కన్న.. నాకు తెలిసిన నీ గురించి ఇప్పుడు ప్రపంచం తెలుసుకుంటుంది.. ప్రపంచ వ్యాప్తంగా నీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటూ ట్వీట్ చేసాడు. ఇక దీనికి జక్కన్న రిప్లై ఇస్తూ.. చిన్న కరెక్షన్ తారక్.. నా జర్నీ కాదు.. మన జర్నీ అంటూ తెలిపాడు.
Haha. Small correction Tarak… Beginning of *OUR JOURNEY..:) https://t.co/ZFBQFmMlp8
— rajamouli ss (@ssrajamouli) December 3, 2022
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























