హిట్ 2 సినిమా రివ్యూ- ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్

2022 Latest Telugu Movie Review, 2022 Latest Telugu Reviews, 2022 Telugu Reviews, Adivi Sesh, Dr Sailesh Kolanu, HIT 2, HIT 2 (2022) – Movie, HIT 2 2022, HIT 2 Critics Review, HIT 2 Film, HIT 2 First Review, HIT 2 Movie, HIT 2 Movie – Telugu, HIT 2 Movie (2022), HIT 2 Movie Highlights, HIT 2 Movie Plus Points, HIT 2 Movie Public Response, HIT 2 Movie Public Talk, HIT 2 Movie Review, HIT 2 Movie Review And Rating, Hit 2 Movie Updates, HIT 2 Review, HIT 2 Story review, HIT 2 Telugu Movie Latest News, HIT 2 Telugu Movie Live Updates, HIT 2 Telugu Movie Review, HIT 2 Telugu Review, Latest 2022 Telugu Movie, latest movie review, Latest telugu movie reviews, Latest Telugu Movie Reviews 2022, Latest Telugu Movies 2022, latest telugu movies news, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, latest tollywood updates, Meenakshi, MM Sree Lekha, Nani, Posani Krishna Murali, Prashanti Tipirneni, Rao Ramesh, Suresh Bobbili, Tanikella Bharani, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా హిట్2. ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఎన్నో అంచనాలు మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. హిట్ సినిమా సూపర్ హిట్ అయినట్టు ఈసినిమా కూడా హిట్ అయిందా లేదా.. భారీ అంచనాలను ఈసినిమా రీచ్ అయిందా లేదా అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. అడివి శేష్, మీనాక్షి చౌద‌రి, భానుచందర్, రావు రమేష్, పోసాని, తనికెళ్ళ భరణి, కోమలీ ప్రసాద్ తదితరులు
దర్శకత్వం.. శైలేష్ కొలను
బ్యానర్స్.. వాల్ పోస్టర్ సినిమా
సమర్పణ.. నాని
నిర్మాత.. ప్రశాంతి త్రిపిర్‌నేని
సంగీతం.. జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి
సినిమాటోగ్రఫి.. మణికందన్‌

కథ..

ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈసినిమాలో అడివి శేష్ హీరోగా వస్తున్నాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కేడీ అలియాస్ కృష్ణదేవ్ (అడివి శేష్) విశాఖలో ఎస్పీ. పలు మర్డర్ కేసులను సాల్వ్ చేస్తుంటాడు. అయితే కేడీకి ఓ సీరియల్ కిల్లర్ సవాల్ విసురుతాడు. సంజన అనే అమ్మాయిని హత్య చేస్తాడు సీరియల్ కిల్లర్. తల, మొండెం, కాళ్ళు, చేతులు… నాలుగు భాగాలుగా బాడీని సపరేట్ చేస్తాడు. తల మాత్రమే సంజనాది అని… మొండెం, కాళ్ళు, చేతులు మరో ముగ్గురు అమ్మాయిలవి అని ఫోరెన్సిక్ టెస్టులో తెలుస్తుంది. ఈ కేసును కేడీ ఎలా సాల్వ్ చేశాడు? కేసును ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో అతడి లవ్ ఆర్య (మీనాక్షి చౌదరి) కి ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు? ఈ కథలో లేడీ పోలీస్ వర్ష (కోమలీ ప్రసాద్), కేడీ పైఅధికారి నాగేశ్వరారావు (రావు రమేష్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ..

సీక్వెల్స్ అంటే మాములు విషయం కాదు అన్న సంగతి తెలిసిందే. అందులోనూ థ్రిల్లర్ సినిమాలంటే అంత ఈజీ కాదు. ప్రేక్షకుడికి బోర్ కొట్టించకూడదు.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే పర్ ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలి.. దానితో పాటు ఫస్ట్ పార్ట్ తో పోలికలు ఉండకూడదు.. అవన్నీ జాగ్రత్తగా పాటించగలిగితేనే సీక్వెల్ ను కనెక్ట్ చేయగలుగుతాం. ఇక ఈవిషయంలో శైలేష్ కొలను సూపర్ సక్సెస్ అయినట్టే అర్థమవుతుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ శైలేష్ కొలను కథని బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా ఈసినిమాకు రన్ టైమ్ కూడా బాగా కలిసొచ్చింది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించినా సెకండాఫ్‌కు మాత్రం ఎగ్జైటింగ్ గురిచేస్తుంది. కిల్లర్ గురించి తెలుసుకునే సీన్లు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కిల్లర్‌పై అసలు ట్విస్ట్‌‌ని క్లైమాక్స్ వరకూ తీసుకెళ్లడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు డైరక్టర్. దాంతో పర్ఫెక్ట్ క్లైమాక్స్ తో ముగించడం జరుగుతుంది.

పెర్ఫామెన్స్

హీరోగా నటించిన అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను ఇప్పటివరకూ చేసిన సినిమాలు చూసుకుంటే మ్యాగ్జిమమ్ ఇలాంటి సస్పెన్స్ నేపథ్యంలో వచ్చినవే. తనకు అనుభవం పాత్రే కాబట్టి చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. కథకు ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. కేడీగా అడివి శేష్ అద్భుతంగా నటించాడు. కాస్త వెటకారం, డ్యూటీలో సిన్సియారిటీ, ప్రేమించిన అమ్మాయి పట్ల కేరింగ్ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ అడివి శేష్ మెప్పిస్తాడు. ఇక హీరోయిన్ గా చేసిన మీనాక్షి చౌదరి కూడా తన పాత్రకు తగినట్టుగా చేసింది. ఎమోషన్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించింది. పోలీస్ పాత్రలో క్యారెక్టర్‌కు అవసరమైన ఇంటెన్స్‌ను కోమలీ ప్రసాద్ క్యారీ చేశారు. లేడీ పోలీస్‌గా ఆమె డ్రస్సింగ్, యాక్టింగ్ బావున్నాయి. శ్రీనాథ్ మాగంటి, రావు రమేష్ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్

థ్రిల్లర్ సినిమాలకు టెక్నికల్ వాల్యూస్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. జాన్ స్టీవార్ట్ ఎడురి నేపథ్య సంగీతం కథలో మూడ్ క్యారీ చేసింది. కెమెరా పనితనం కూడా సినిమా మూడ్‌ను అలానే కంటిన్యూ చేయించింది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపిస్తాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే హిట్ 2 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చ. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈసినిమా బాగా నచ్చుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fourteen =