టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాలతో ఇప్పటికే డిఫరెంట్ గా విభిన్నంగా సినిమాలు తీస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు హనుమాన్ తో మరోసారి తన మార్క్ ను చూపించాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈసినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే కేవలం టీజర్ మాత్రమే ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా ఈసినిమాలో విజువల్స్, గ్రాఫిక్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. వాటర్ ఫాల్స్, విశ్వం, అంతరిక్షం ఇలా అన్నీ కూడా అద్భుతంగా చూపించాడు. అంతేకాదు కోట్లలో బడ్జెట్ లేకపోయినా ఉన్న బడ్జెట్ తోనే ఈ స్థాయిలో అవుట్ పుట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సోషల్ మీడియాలో నెంబర్ వన్ లో ట్రెండింగ్ లో నడుస్తుంది. ఈటీజర్ రిలీజ్ అయిన 24 గటంలో 12 మిలియన్ వ్యూస్ ను అలానే 4 లక్షల లైకులను సొంతం చేసుకుంది. మరి ఈరేంజ్ లో రెస్పాన్స్ రావడం అంటే సూపర్ అని చెప్పాలి.
INDIA CHANTS #HANUMAN ✊🏻
12M+ Views with 400K+ Likes for #HanuManTeaser in 24Hours❤️🔥
Grateful for the Earth Shattering response🙏🏻
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123@Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets pic.twitter.com/cBSIxiMNqV— Primeshow Entertainment (@Primeshowtweets) November 22, 2022
కాగా `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: