ఈమధ్య హీరోలు తమ రూట్ మార్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క హీరోలుగా సినిమాలు చేస్తూనే మరోపక్క సొంత ప్రొడక్షన్ హౌస్ లు పెట్టేసుకుంటున్నారు. తమ సినిమాలను తామే నిర్మించుకుంటున్నారు. అంతేకాక వేరే హీరోలతో కూాడా సినిమాలను చేస్తున్నారు. అలాంటి హీరోల్లో నాని కూడా ఉన్నాడు. ఇప్పటికే హిట్2 సినిమాను నిర్మిస్తుండగా మరోవైపు మీట్ క్యూట్ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఈసినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమా ఇప్పటివరకూ పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
When 5 cute meets change perspectives on relationships and beyond ❤️
The ‘Cutest Anthology Ever’ 🤗#MeetCute teaser out now!
– https://t.co/Vg6j0dreA4Streaming soon on @SonyLIV!@mail2ganta @NameisNani @tprashantii pic.twitter.com/V110OmilWc
— Wall Poster Cinema (@walpostercinema) November 12, 2022
కాగా వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని ఈసినిమాను నిర్మిస్తుండగా సత్యరాజ్ ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఐదుగురు హీరోయిన్స్ ఈసినిమాలో నటిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, సునైనా, ఆదా శర్మ, రుహానీ శర్మ, ఆకాంక్ష సింగ్ ఇంకా రోహిణి నటిస్తున్నారు. అయితే ఈసినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఈసినిమా నాని సిస్టర్ కు నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: