మన హీరోలు రీల్ లో కాదు రియల్ లైఫ్ లో కూడా రియల్ హీరోలని అనిపించుకుంటారు. చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకూ అందరూ నిజ జీవితంలో ఎన్నో సేవకార్యక్రమాలు చేస్తారు. అయితే కొంతమంది చేసే పనులు బయటకి కనిపించినా.. కొంతమంది చేసే పనులు మాత్రం బయటకు రావు. ఎవరో ఒకరు చెబితే కానీ తెరపైకి రావు. ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పని కూడా వెలుగులోకి వచ్చింది. కేరళలో ఒక పేద విద్యార్థినిని అల్లు అర్జున్ ఆదుకున్నాడు. అదేంటో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేరళలో అలెప్పీ జిల్లా కలెక్టర్ గా కృష్ణతేజ వూ ఆర్ అలెప్పీ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం పేరుతో ఎంతో మంది పేదలకు నిరాశ్రయులకు సాయం చేస్తుంటారు. ఈనేపథ్యంలో కరోనా వల్ల తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థిని నర్సింగ్ చదువు నిమిత్తం ఆర్థిక సహాయం కావాల్సి ఉంది. దాంతో అప్పటికే ఈ ప్రోగ్రాంలో భాగస్వామిగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహాయాన్ని జిల్లా కలెక్టర్ కోరారు. ఇక దీనికి స్పందించిన అల్లు అర్జున్ నర్సింగ్ కాలేజ్‌లో మేనేజ్‌మెంట్ కోటాలో సీటుకయ్యే ఖర్చు తాను భరిస్తానంటూ బన్నీ మాటిచ్చారు. నాలుగేళ్లు తన చదువు కోసం అయ్యే ఖర్చును తానే ఇస్తానంటూ చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు కృష్ణతేజ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో… ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బన్నీ చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక బన్నీకి కేరళలో కూడా ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే తను పుష్ప2 సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్దమవుతున్నాడు. పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: