అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు షూటింగ్స్ లేకపోతే ఫ్యామిలీతో కలిసి ట్రిప్ లకు వెళుతుంటాడు.. పిల్లలతోనే తన సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ముఖ్యంగా కూతురు అర్హ అంటే బన్నీకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్హ చిన్నప్పటినుండి తన క్యూట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉండేవాడు బన్నీ. ఇప్పుడు కూడా బన్నీ అప్పుడప్పుడు అర్హ ఫొటోలు కానీ, వీడియోలు కానీ పోస్ట్ చేస్తూనే ఉంటాడు. రీసెంట్ గా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో, అలాగే గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అల్లు అర్జున్, అర్హ సందడి చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరోసారి వీరిద్దరి ఫొటో వైరల్ గా మారింది. కూతురితో అల్లు అర్జున్ కారులో నైట్ రైడ్ కు వెళ్లారు. కారులోనే అల్లు అర్జున్, అర్హ ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తున్నారు. ప్రస్తుతం తండ్రీకూతురు కారులో కలిసి భోజనం చేస్తున్న ఈ ఫొటోను కూడా నెట్టింట వైరల్ చేస్తున్నారు.

ఇక గత ఏడాది పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి సినిమాతోనే తన సత్తా చూపించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సంగతి తెలిసిందే కదా. రా అండ్ రస్టిక్ పాత్రలో బన్నీ చేసిన నటనకు సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ సైతం ఫిదా అయిపోయారు. ఈసినిమా సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్గా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























