మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా ఈనెల 5వ తేదీన రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చినా కూడా ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా కథలో పలు మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ఈసినిమాను తెరకెక్కించాడు. అందుకే ప్రేక్షకులకు ఆసినిమానే చూస్తున్న ఫీలింగ్ లేకుండా తెలుగు స్ట్రైయిట్ సినిమానే చూస్తున్నట్టు ఉంటుంది అందరికీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం ఇక ఈసినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లు కూడా పెంచుతున్నారు మేకర్స్. మంచి టాక్ రావడం మాత్రమే కాకుండా, మౌత్ టాక్ కూడా బాగుండటం తో ఈ సినిమా కి క్రేజ్ పెరుగుతోంది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది ఈ సినిమా. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అదనపు షోలు, థియేటర్లు చేరాయి. మరి ఈసినిమా సక్సెస్ అయిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం వేరే లేదని చెప్పొచ్చు.
కాగా ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్.. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటించారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: