పెళ్లి పీటలెక్కబోతున్న గుణశేఖర్ కూతురు

Gunasekhar Daughter Neelima Gets Engaged, Neelima Gets Engaged, Gunasekhar Daughter Neelima, Director Gunasekhar, Filmmaker Gunasekhar, Gunasekhar Latest Movie, Gunasekhar's Upcoming Movie, Gunasekhar's Shaakuntalam Movie, Shaakuntalam, Shaakuntalam Telugu movie, Shaakuntalam New Update, Shaakuntalam Telugu Movie New Update, Shaakuntalam Movie, Shaakuntalam Latest Update, Shaakuntalam Movie Updates, Shaakuntalam Telugu Movie Live Updates, Shaakuntalam Telugu Movie Latest News, Shaakuntalam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఈ రెండేళ్లలో ఎంతో మంది సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగిపోయాయి. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా వివాహం చేసుకొని తల్లి కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా పెళ్లి పీటలెక్కబోతుంది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమ గుణశేఖర్. గుణశేఖర్ కూతురు నీలిమ గుణశేఖర్ రవి ప్రఖ్యా అనే వ్యక్తిని వివాహమాడనున్నారు. ఈనేపథ్యంలో ఈవిషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ న్యూ బిగినింగ్ అంటూ తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు గుణశేఖర్ కూడా ఈవిషయాన్ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు నా పెద్ద కూతురు నీలిమ గుణశేఖర్ పెళ్లి లగ్నపత్రిక వేడుక జరుగుతుంది అంటూ సంతషం వ్యక్తం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రస్తుతం గుణశేఖర్ నుండి వస్తున్న సినిమా శాకుంతలం. మ‌హాభార‌త ఇతిహాసంలో అద్భుత‌మైన ప్రేమ ఘ‌ట్టంగా చెప్పుకునే ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా చేసుకుని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తిఅయిపోయింది.. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే వాయిదా వేసిన సంగతి తెలిసిందే కదా.

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా 3Dలో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 12 =