కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. .ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గాడ్ ఫాదర్ గా, బ్రహ్మ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నయనతార , సత్యదేవ్ , అతిధి పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ తలాక్ తో దూసుకుపోతోన్న గాడ్ ఫాదర్ మూవీ భారీ వసూళ్ళు సాధించింది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 69 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.దసరా పండగ రోజు బుధవారం సాయంత్రం చిరు ఇంట గాడ్‌ఫాదర్ సక్సెస్ సెలబ్రేషన్స్ మేకర్స్ నిర్వహించారు. దర్శకుడు మోహన్‌రాజా, నిర్మాతలు ఆర్.బి.చౌదరి, ఎన్వీప్రసాద్, సత్యదేవ్, తమన్.. చిరంజీవికి పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. మైత్రిమూవీ మేకర్స్ నిర్మాతలు, హరీశ్ శంకర్, మెహర్ రమేశ్ కూడా చిరు ఇంట జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు.గాడ్‌ఫాదర్ చిత్రంలో అతిథిగా కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సినిమా విజయాన్ని ఉద్దేశించి ఓ వీడియో పోస్ట్ చేశారు. చిరు సర్ ఐ లవ్ యూ. సినిమా పెద్ద హిట్ అయిందని విన్నాననీ , కంగ్రాట్స్. భగవంతుడి ఆశీసులు మీకుండాలనీ , వందేమాతరం అంటూ ఆ వీడియోలో సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు . దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ .. తన కల నిజమైన క్షణమిదనీ , సినిమా విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ నడుస్తోందనీ , ఈ హిట్ అదృష్టంగా భావిస్తున్నాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: