శాకుంతలం రిలీజ్ డేట్ ఫిక్స్

Samantha Shaakunthalam Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Shaakunthalam,Shaakunthalam Movie,Shaakunthalam Telugu Movie,Shaakunthalam Release Date,Shaakunthalam Movie Release Date,Shaakunthalam Telugu Movie Release Date,Samantha,Shaakunthalam Telugu Movie Release Date Locked,Shaakunthalam Movie Release Date Confirmed,Samantha Shaakunthalam Movie,Actress Samantha

ఈమధ్య కాలంలో పీరియాడిక్ సినిమాలకు బాగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. ఇక అలా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న సినిమానే శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కోసం సినీ ప్రేక్షకులతో పాటు సమంత అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తిచేసుకొని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్ప‌టికే ఈసినిమా నుండి విడుదలైన స‌మంత ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ కానీ, దేవ్ మోహన్ పోస్టర్ కానీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఫైనల్ గా వారి ఎదురుచూపులకు బ్రేక్ పడింది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను నవంబర్ 4వ తేదీన ఈసినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ దాదాపు ఏడేళ్ళు టైం తీసుకుని శాకుంత‌లం చిత్రాన్ని తెర‌కెక్కించాడు. మరి ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 7 =