అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. దీంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక అలాంటి అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయం తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీ నటులు.. నాగశౌర్య, షిర్లే సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం.. అనీష్ కృష్ణ
బ్యానర్స్.. ఐరా క్రియేషన్స్ బ్యానర్
నిర్మాతలు.. ఉషా ముల్పూరి
సంగీతం.. మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫి.. సాయి శ్రీరామ్
కథ
కృష్ణాచారి(నాగ శౌర్య) ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఎన్నో కట్టుబాట్ల మధ్య పెరిగిన వ్యక్తి. ఇక కృష్ణ తల్లి
అమృతవల్లి (రాధిక శరత్ కుమార్) తమ ఊర్లోనే చాలా స్ట్రిక్ట్ గా ఉండే వ్యక్తి. అందరూ ఆమెకి భయపడుతుంటారు. ఆమెకు భయపడే ఊర్లోని అమ్మాయిలంతా కూడా కృష్ణను అన్నయ్య అని కూడా పిలుస్తుంటారు. అలాంటి కృష్ణ ఉద్యోగం నిమిత్తం సిటీకి వస్తాడు. ఇక అక్కడే వ్రింద (షెర్లీ సెటియా)ను చూసి ఇష్టపడతాడు. అయితే వ్రిందకు ఒక సమస్య ఉంటుంది. అయినా సరే కృష్ణ అబద్దం చెప్పి పెళ్లి చేసుకుందామని అంటాడు. మరి వ్రింద కు ఉన్న సమస్య ఏంటీ.. ? వ్రిందను పెళ్లి చేసుకునేందుకు కృష్ణ చెప్పిన అబద్దం ఏంటి? పెళ్లి అయ్యాక కృష్ణ ఆడిన అబద్దాల వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? చివరికి వీరి జంటకి ఎలాంటి ముగింపు ఉంటుంది అనేది ఈసినిమా కథ
విశ్లేషణ
ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఇంట్లో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత అబద్ధాల వల్ల అనేక ఇబ్బందులు పడటం అనే కాన్సెప్ట్ గతంలో అనేక సినిమాల్లో చూశాం. ఇక ఈసినిమా కాన్సెప్ట్ వింటే రీసెంట్ గానే ఎక్కడో విన్నట్టు ఉంది. బ్రహ్మాణ యువకుడు, పాష్ అమ్యాయి ఈ కాన్సెప్ట్ తో ఇటీవల రిలీజ్ అయిన అంటే సుందరానికి సినిమా ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇక కన్సెప్ట్ కొత్తది కాకపోయినా దానిని ఎగ్జిక్యూటివ్ చేయడంలో అనీష్ కృష్ణ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. టీజర్, ట్రైలర్ లలో చూసినట్టే ఈసినిమాను కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు. కామెడీతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మొదటి సినిమా అయినా కూడా చాలా బాగా డైరెక్ట్ చేశాడని చెప్పొచ్చు
పెర్ఫామెన్స్
ఇక నాగశౌర్య పాత్ర ఇందులో చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఇంతకుముందు సినిమాల్లో సెటిల్డ్ పాత్రలో నటించాడు నాగశౌర్య. ఇక ఈసినిమాలో బ్రాహ్మణ యువకుడిగా నటించడమే కాకుండా తన కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో బాగా చూపించాడు. భార్యాభర్తలు, అత్తా కోడలు, భార్యకు తల్లికి మధ్యలో నలిగే కొడుకుగా నాగశౌర్య తన కామెడీతో చాలా ఫన్ క్రియేట్ చేశాడు. ఇక హీరోయిన్ షిర్లే సెటియా కి ఈ చిత్రం ఓ మంచి డెబ్యూట్ అని చెప్పాలి. సినిమాలో చాలా క్యూట్ గా అందంగా కనిపించడమే కాకుండా నటన పరంగా కూడా తాను బాగా ఇంప్రెస్ చేస్తుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఈసినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక నాగశౌర్య తల్లి పాత్రలో నటించిన రాధిక జీవించేసింది. ఒక నిజమైన సంప్రదాయ కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ స్త్రీ ఇలానే ఉంటుందా అనిపించే విధంగా ఆమె నటించింది. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించి మెప్పించారు.
టెక్నికల్ వాల్యూస్
మహతి సాగర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు ఒకటి రెండూ ఆకట్టుకుంటాయి పర్వాలేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినమాకు తగ్గట్టు ప్లజంట్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు కాస్త రిచ్ లుక్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి, సొంత ప్రొడక్షన్ కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారు. ప్రతి ఫ్రేమ్ లోనూ అది కనిపిస్తుంది.
మొత్తానికి ఈసినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు ఈసినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: