#SSMB28 మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్

#SSMB28 Movie Latest update

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు , పూజా హెగ్డే జంటగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో భారీ యాక్షన్ సీన్ తో #SSMB28 మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 12 వ తేదీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22 వ తేదీ తో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందనీ , యువ ఫైట్ మాస్టర్స్ అన్బరివు నేతృత్వంలో భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించామనీ , దసరా అనంతరం ప్రారంభం అయ్యే సెకండ్ షెడ్యూల్ లో సూపర్ స్టార్ మహేష్, పూజా హెగ్డే పాల్గొంటారనీ చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + fifteen =