లక్కీ మీడియా బ్యానర్ పై ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు , కయడు లోహర్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అల్లూరి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సుమన్ , తనికెళ్ళ భరణి , రాజా రవీంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లూరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా పాల్గొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ .. ఇక్కడికి వచ్చిన తన ఫ్యాన్స్ కి, అలానే శ్రీవిష్ణు గారి ఫ్యాన్స్, వెల్ విషర్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు అనీ , శ్రీవిష్ణు గారి ఫస్ట్ మూవీ ప్రేమ ఇష్క్ కాధల్ లో ఆయన యాక్టింగ్ తనకు విపరీతంగా నచ్చిందనీ , అందుకే అటువంటి గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి మంచి కంటెంట్ కలిగిన మూవీస్ సెలెక్ట్ చేసుకుంటే కెరీర్ మరింతగా బాగుంటుందని సలహా ఇచ్చాననీ , శ్రీవిష్ణు నటించిన ప్రతి మూవీ తాను చూశాననీ , కొన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ కూడా ప్రతి సినిమాలో ఆయన నటనని మరింతగా ఇంప్రూవ్ చేసుకుంటూ కొనసాగుతున్నారనీ , అల్లూరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానించగానే వెళ్ళాలి అనిపించి వెంటనే ఒప్పుకున్నాననీ , నిర్మాత వేణుగోపాల్, దర్శకుడు ప్రదీప్ వర్మ , హీరోయిన్ కయడు లోహర్ , అలానే యావత్ యూనిట్ మొత్తానికి తన బెస్ట్ విషెస్ అనీ , మంచి మనస్సుగల శ్రీవిష్ణు గారి అల్లూరి తప్పకుండా పెద్ద సక్సెస్ అందుకోవాలని తాను కోరుకుంటున్నాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: