ఆరోజే ఆదిపురుష్ టీజర్ రిలీజ్?

Interesting Buzz about Adipurush Movie Teaser, Prabhas starrer Adipurush, Buzz about Adipurush Movie Teaser, Adipurush Movie Teaser Interesting Buzz, Adipurush Telugu Movie Teaser, Adipurush Teaser, mythological film Adipurush, Director Om Raut, Prabhas And Kriti Sanon starrer Adipurush, Adipurush Movie, Adipurush Telugu Movie, Adipurush New Update, Adipurush Movie Latest Update, Prabhas Latest Movies, Prabhas Upcoming Movies, Actor Prabhas, Prabhas, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆది పురుష్. హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోవైపు ఈసినిమా నుండి ఇప్పటి వరకూ ఒక్క అప్ డేట్ ఇచ్చింది కూడా లేదు. సినిమా మొదలుపెట్టినప్పుడు మాత్రం ఓం రౌత్ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం ఇస్తుండే వాడు. అంతకుమించి ఈసినిమా నుండి ఒక్కటంటే ఒకటి కూడా సాలిడ్ అప్ డేట్ ఇవ్వలేదు. శ్రీరామ నవమి లాంటి పండుగ అప్పుడైనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమో అని చూశారు అది జరగలేదు. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను అక్టోబర్ నుండి మొదలుపెట్టనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈసినిమా టీజర్ అప్ డేట్ గురించి కూడా ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. తాజాగా మరోసారి టీజర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ ఏడాది ఢిల్లీ లో జరిగే ప్రతిష్టాత్మక దసరా మహోత్సవాలు లో ప్రభాస్ పాల్గొనడం కన్ఫర్మ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ల‌వ్‌కుశ్ రాంలీలా క‌మిటీ ఎర్రకోట వ‌ద్ద అయోధ్య‌లోని రామాల‌యం థీమ్‌పై మండ‌పాన్ని ఏర్పాటు చేస్తోంది. చెడుపై మంచి సాధించిన విజ‌యానికి చిహ్నంగా రావణుడి దిష్టి బొమ్మ‌ను ద‌గ్ధం చేయడం ఈ కమిటీ ఆనవాయితీ. 10 తలల రావణాసురుడి భారీ విగ్రహాన్ని దగ్ధం చేయడానికి సెలబ్రిటీలను ఈ కమిటీ ఆహ్వానిస్తుంటుంది. ఈ ఏడాది ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. ఇక ఆ సమయంలోనే ఆదిపురుష్ టీజర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 20 =