ఒక సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో సినిమాను అప్పుడే లైన్ లో పెట్టేశాడు ఓ యంగ్ హీరో. ఆహీరో ఎవరోకాదు బెల్లంకొండ వారసుడు బెల్లంకొండ గణేష్. బెల్లంకొండ సురేష్ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సురేష్ రెండో కుమారుడు, శ్రీనివాస్ తమ్ముడు గణేష్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నసంగతి తెలిసిందే. ‘స్వాతి ముత్యం’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుటుంది. వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తుండగా పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇంకా రిలీజ్ కాకముందే అప్పుడే రెండో సినిమాను ప్రకటించాడు బెల్లంకొండ గణేష్.రాకీ ఉప్పలపాటీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి నేను స్టూడెంట్ సార్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. పోస్టర్‌లో గణేష్‌పై పోలీసులు తుపాకీలను గురిపెట్టగా.. చేతిలో ఐడీ కార్డు పట్టుకొని ఆశ్చర్యంతో నిల్చుంటాడు. మరి పోస్టర్ చూస్తుంటే ఈసినిమా థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్నట్టు అర్థమవుతుంది.
A unique thriller that flaunts the courage of a student in an outrageous way!
Presenting the Title & First Look of @SV2Ent #ProductionNo2#𝑵𝒆𝒏𝒖𝑺𝑻𝑼𝑫𝑬𝑵𝑻𝒔𝒊𝒓✊
🌟ing #GaneshBellamkonda
💰@NaandhiSATISH
🎬 #RakhiUppalapati@mahathi_sagar @manithkumar @ChotaKPrasad pic.twitter.com/gsbUviG13g— 𝐒𝐕𝟐 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 (@SV2Ent) September 9, 2022
కాగా ఈసినిమాను నాంది వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించిన ఎస్‌వీ2 ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహాతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: