బింబిసార2 కోసం పవర్ ఫుల్ లేడీ విలన్?

Powerful Lady Villain In Bimbisara 2, Lady villain for Bimbisara sequel, Bimbisara sequel, Powerful Lady Villain, Lady Villain In Bimbisara 2, Bimbisara 2, Bimbisara 2 Latest Update, Bimbisara 2 New Update, Bimbisara Movie Sequel Latest Update, Bimbisara Part 2, Bimbisara 2 Telugu Movie, Lady Villain, Bimbisara 2 Latest News And Updates, Kalyan Ram, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్స్ తీయడం కామన్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పటికే ఎన్నో సీక్వెల్స్ వచ్చి విజయం కూడా సాధించాయి. ఈ ఏడాదే ప్రారంభంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సూపర్ హిట్ అయింది. ఆ తరువాత కె.జి.యఫ్ సీక్వెల్ కె.జి.యఫ్ 2 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2 కూడా ఎంత సంచలనాలు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో హిట్ మూవీకి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనెలలో రిలీజ్ అయిన సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సినిమాల్లో బింబిసార కూడా ఒకటి. రెండు నెలల నుండి సరైన హిట్లు లేక సతమతమవుతున్న ఇండస్ట్రీకి ఈసినిమా విజయం కూడా కాస్త ఊరటనిచ్చింది. చాలా గ్యాప్ తరువాత బింబిసార అంటూ కెరీర్ లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వచ్చాడు కళ్యాణ్ రామ్. మల్లిడి విశిష్ట అనే కొత్త దర్శకుడితో బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ ను కొట్టాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు.

ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని కల్యాణ్ రామ్ ఎప్పుడో చెప్పేశాడు. ప్రస్తుతం అయితే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని అంటున్నారు. ‘బింబిసార 2’ను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో లేడీ విలన్ రోల్ ను పవర్ఫుల్ గా డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. ఆ పాత్రకి గాను బాగా క్రేజ్ ఉన్న ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నారని చెబుతున్నారు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మించాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథ‌రిన్ థెరిసా, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా నటించగా.. వారినా హుస్సేన్, వివాన్ భటేనా, ప్రకాష్ రాజ్, అయ్యప్ప శర్మ, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =