సినిమా సినిమాకు డిఫరెంటె జోనర్స్ ను సెలక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు. ఒక్కోసారి లవర్ బాయ్ పాత్రలో, ఒక్కోసారి ఫుల్ మాస్ రోల్ లో మరోసారి ప్రేమకథలు ఇలా తన సినిమాల్లో వైవిధ్యతను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం అయితే సుధీర్ బాబు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా. ఈసినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనితో పాటు హర్షవర్ధన్ డైరక్షన్ లో కూడా మరొక సినిమా చేస్తున్నాడు. మాయా మశ్చింద్రా టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా మహేష్ దర్శకత్వంలో కూడా సుధీర్ తన 16వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాకు హంట్.. (గన్స్ డోంట్ లై) అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. కనిపించని శత్రువు కోసం హీరో జరిపే వేట ఈ చిత్రం ప్రధాన కథాంశంగా రూపొందుతుంది. ఈసినిమాలో సుధీర్ బాబు పోలీస్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
You think the HUNT is done FOR ME?
Little did you know that the HUNT is done BY ME !!https://t.co/l9SeRBHT48#Sudheer16 is titled #HUNT 👊 #HuntTheMovie@bharathhere @actorsrikanth @Imaheshh @GhibranOfficial #Anandaprasad @BhavyaCreations @anneravi @vincentcinema pic.twitter.com/mxMCNPMEHH
— Sudheer Babu (@isudheerbabu) August 28, 2022
కాగా ఈసినిమాలో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కూాడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి చూస్తుంటే ఈసారి సుధీర్ బాబు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడని అనిపిస్తుంది. చూద్దాం మరి ఈసినిమా ఎలా ఉండబోతుందో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: