పోల్ గేమ్ :రీసెంట్ రిలీజ్ మూవీస్ లో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన హీరో ?

Which Recent Telugu Hero’s Performance Impressed You The Most,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Bimbisara,Sita Ramam,Karthikeya 2,Liger,Bimbisara Nandamuri Kalyan Ram,Sita Ramam Dulquer Salmaan,Nikhil Siddhartha in Karthikeya 2 Movie,Vijay Deverakonda Liger Movie,Heros Performance in Recent Movies,Recent Tollywood Movies,Tollywood Heros in Recent Movie,Telugu Heros In Recent Movies Best Performance,Recent Hero Performance that Impress Yout The Most

బింబిసార – కళ్యాణ్ రామ్ : ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు..భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న బింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.మొదటి వారం లో బింబిసార మూవీ 20 కోట్లకు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించింది.50 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీతారామం – దుల్కర్ సల్మాన్ : వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ లో రామ్ గా హీరో దుల్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. ఎమోషన్ , రొమాంటిక్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దుల్కర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కార్తికేయ 2 – నిఖిల్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు. అద్భుతమైన విజువల్స్ తో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీలో కార్తికేయ పాత్రలో నిఖిల్ అడ్వెంచర్ సన్నివేశాల్లో అలాగే సెకండాఫ్ లో వచ్చే కీలక సీన్స్ లో కూడా నిఖిల్అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

లైగర్ – విజయ్ దేవరకొండ: పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ రాబట్టింది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించారు. ఫుల్ ఎనర్జీతో సాగే విజయ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం విజయ్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. గత సినిమాల్లో కంటే, ఈ సినిమాలో విజయ్ నటన చాలా కొత్తగా ఉంటుంది. తన హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో విజయ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు.

పోల్ గేమ్ :రీసెంట్ రిలీజ్ మూవీస్ లో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన హీరో ?

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =