వెయిట్ చేస్తున్నా శంకర్ సార్

Ram Charan Excited to Resume #RC15 Shoot,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Ram Charan,Mega PowerStar Ram Charan,Hero Ram Charan,Ram Charan Rc15 Resumes Shootng,RC15 Movie Shooting Updates,Shankar RC15 Movie Latest Updates,RC15 Latest Shooting Updates,Ram Charan Upcoming Movies,Ram charan New Movie Updates,Ram Charan RC15 Latest Shooting Updates,Shankar to Resume RC15 Shooting

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. భారీ బడ్జెట్ తో ఈసినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ గ్యాప్ లో పలు రూమర్స్ కూడా వచ్చేశాయి. టెక్నికల్ గా ఏదో సమస్య రావడంతో ఈ సినిమాకు కొద్ది రోజులు బ్రేక్ పడనుందన్న వార్తలు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ రూమర్స్ తో పాటు ఇండియన్ 2 సినిమా షూటింగ్ పై కూడా క్లారిటీ ఇచ్చాడు. RC15 సినిమా సెట్స్ పైన ఉండగానే ఇండియన్ 2 సినిమాను కూడా మొదలుపెట్టేస్తున్నాడు శంకర్. ఈవిషయాన్ని శంకర్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియచేశారు. ఇండియన్ 2, RC15 రెండు కూడా ఒకే సారి షూటింగ్ జరుగుతాయి.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో హైద్రాబాద్, వైజాగ్‌లో షూటింగ్‌కు రెడీగా ఉండండి అంటూ క్లారిటీ ఇచ్చాడు.

అయితే తాజాగా ఈ పోస్ట్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. RC15 షూటింగ్ సెట్స్ లో మిమ్మల్ని కలిసేందుకు ఎదురు చూస్తున్నాను.. ఇండియన్2 సినిమాను మళ్లీ స్టార్ట్ చేసినందుకు ఎగ్జైట్ గా అవుతున్నా.. ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా ఈసినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twenty =