బ్రహ్మాస్త్ర డ్యాన్స్ కా బూత్ ఫుల్ సాంగ్ రిలీజ్

Dance Ka Bhooth Full Song From Brahmastra Out Now,Dance Ka Bhoot: Brahmastra Movie Third Single Full Song Out Now,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Movie Songs,Brahmastra Telugu Movie Songs,Brahmastra Movie Third Single Song, BrahmastraThird Song Out Now, Brahmastra Dance Ka Bhoot Third Single Song Out Now,Ranbir Kapoor,Bollywood Star Hero Ranbir Kapoor Brahmastra Movie Song Dance ka Bhoot

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను యధార్ధంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఆలోచన నుంచి వచ్చిన చిత్రమే ఈ బ్రహ్మస్త్రం. చిన్నప్పటినుంచి విన్న కథలు, ప్రాచీన భారతీయ సంస్కృతి వాటి మూలాలు ఈ సినిమా బ్రహ్మస్త్రం సినిమాకి ఆధారం అని అయాన్ ముఖర్జీ ఇప్పటికే చెప్పాడు. ఇక ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది చిత్ర యూనిట్. దర్శకధీరుడు రాజమౌళి సౌత్ ప్రమోషన్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే సౌత్ లో పలు ప్రాంతాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు మరో డ్యాన్స్ నెంబర్ ను రిలీజ్ చేశారు. డ్యాన్స్ కా బూత్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.. దీనికి సంబంధించిన టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. నేడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆర్జిత్ సింగ్ పాడిన ఈపాట ఇంకా బీట్ అలానే రణబీర్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.

కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న  ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =