సూర్య 42 షూటింగ్ ప్రారంభం

Suriya 42 Movie Launched In Style,Suriya 42 Shoot Has Officially Begun – Details Here, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Suriya,Hero Suriya,Suriya 42 Movie Updates,Suriya Latest Movie Updates,Suriya 42 Movie Shoot Beguns,Suriya Upcoming Movie Updates,Suriya 42 Movie Latest Updates,Suriya 42 Movie Shooting Updates,#Suriya42,Aadhi Narayana,Disha Patani,Director Siva,Suriya Movie Updates

ప్రస్తుతం విభిన్నమైన సినిమాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు సూర్య. ప్రస్తుతం అయితే తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు సూర్య. ఇప్పటికే సూర్య విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో శివ పుత్రుడు సినిమా రాగా ఇప్పుడు చాలా ఏళ్ల తరువాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సూర్య కెరీర్లో 41వ సినిమాగా ఈసినిమా వస్తుంది. అచలుడు అన్న టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను 2డి ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జ్యోతిక నిర్మిస్తున్నారు. జీవి ప్రకాశ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాతో పాటు శివ దర్శకత్వంలో కూడా సూర్య ఒక సినిమా చేస్తున్నాడు. శివ కూడా అజిత్ తో అలానే రజినీ కాంత్ తో సినిమాలు చేసి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. తొలిసారి ఆయ‌న సూర్య‌తో సినిమా చేస్తున్నాడు. ఇక నేడు ఈసినిమా షూటింగ్ ప్రారంభించారు చిత్రయూనిట్. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

కాాగా ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఏకకాలంలో రూపొందించనున్నట్టు తెలుస్తుంది. ఇక సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తుండటంతో సూర్య ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డేని తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =