‘కార్తికేయ2’ రిలీజ్ డేట్ ఛేంజ్..!

Karthikeya 2 Movie Gets A New Release Date,Karthikeya 2 Release Date Postponed Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie latest Updates,Karthikeya 2 Release Postpone Again, Nikhil Siddharth Upcoming Movie Karthikeya 2 Release Date Postpone,Karthikeya 2 New Movie Release Date Postpone, Makers of Karthikeya 2 Movie Postpone the Release Date,Move Makers Postpone Release Date,Karthikeya 2 Movie Releasing on 13th August

త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాల్లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సినిమా కార్తికేయ2 అని కూడా చెప్పొచ్చు. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న ఈసినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశారు. ఈ సినిమాలోని అడ్వెంచర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక మరో థియేట్రికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి డేట్ ను ఫిక్స్ చేశారు. ఆగష్ట్ 6వ తేదీన ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఆగష్ట్ 12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. అయితే గత కొద్దిరోజులుగా మళ్లీ రిలీజ్ డేట్ మార్చే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇక అన్నట్టుగానే రిలీజ్ డేట్ ను మార్చారు. అయితే ఎక్కువ రోజులు పోస్ట్ పోన్ చేయలేదు. కేవలం ఒక్క రోజు పోస్ట్ పోన్ చేశారు. ఆగష్ట్ 13వ తేదీన ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు.

ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా… ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. మరి ఇప్పటి వరకూ నార్త్ లో రిలీజ్ అయిన సినిమాలు మంచి విజయాలనే అందించుకున్నాయి. మరి నిఖిల్ కు నార్త్ ఆడియన్స్ ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 13 =